ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
దోమ, మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బొంపల్లి సర్పంచ్ విజయ పవన్ యాదవ్ అన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మంగళవారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అంతిరెడ్డి, గ్రామ అధ్యక్షులు గుడిసె రాములుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోసిన్ పాషా, గ్రామపంచాయతీ కార్యదర్శి మీనా, రేషన్ డీలర్ నరేందర్, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముబేర్, లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: బద్రి, దోమ, వికారాబాద్ జిల్లా.