BREAKING
నెల్లూరు సిటీలో టీడీపీ తొలి విజయం! కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం. శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ భారీ ఆధిక్యం వైపు! తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు! అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యం నెల్లూరు 51వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం! ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో శకం ముగింపు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్లెన్ మాక్స్‌వెల్! సొంత డివిజన్‌లోనే ఆనం విజయకుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ! 17 వ వార్డులో వై కా పా అభ్యర్థి దీప్తి ఘనవిజయం. నెల్లూరు రూరల్ 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విజయం! నెల్లూరు సిటీ 14వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం! ‘అర్నబ్’ తుఫాన్ నష్టాన్ని సకాలంలో నివారించగలిగాం నెల్లూరు రాజకీయాల్లో జనసేన సంచలనం! చేనేతపురంలో "ధరణి "భోని సారా అలీ ఖాన్ ఫేక్ ఫ్రెండ్.. నా కష్టకాలంలో కనిపించకుండా పోయింది: ఓరి సంచలన వ్యాఖ్యలు!

భూసార పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా

Select Suryaa Now
భూసార పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా

 

సూర్య సుల్తానాబాద్ 

 

 భూసార పరిరక్షణతోనే వ్యవసాయ రంగానికి భవిష్యత్తులో భరోసా ఉంటుందని, రైతులు నేల స్వభావాన్ని తెలుసుకొని పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి ఈ. పైడితల్లి సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేతి బచావో (Save Farm) ప్రచార కార్యక్రమంలో భాగంగా గర్రెపల్లి గ్రామ రైతు వేదికలో రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి వ్యవసాయ శాఖకు అందజేస్తే ప్రయోగశాలకు పంపించి భూసార పరీక్షల ఫలితాలను అందిస్తామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గత సీజన్‌లో సేకరించిన మట్టి నమూనాల ఫలితాలను రైతులకు పంపిణీ చేస్తూ, వాటి ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులనే వినియోగించాలని సూచించారు.కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, పెద్దపల్లికి చెందిన శాస్త్రవేత్త డా. ఓదెల సంపత్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న, అపరాల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే వరి కోత అనంతరం మిగిలే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా భూమిలోనే కలియదున్నడం ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి, గర్రెపల్లి ఏఈఓ ఆనందరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.