BREAKING
కాటారం బంకుల్లో కొలతల మాయాజాలం-నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న లీగల్ మెట్రాలజీ విభాగం సమస్యలు పరిష్కరించని సర్వసభ్య సమావేశాలు ఎందుకు.. అధికారుల తీరుపై మండిపడ్డ సర్పంచ్ రామేశ్వర్ భూసార పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా ఆర్టీసీ యాజమాన్య వైఖరి మార్చుకోకుంటే పోరాటం తప్పదు .... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం.

లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం

Select Suryaa Now
లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం

మహాదేవపూర్, మేజర్ న్యూస్, ఇసుక లారీ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘోర ప్రమాదం మహాదేవపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మహాదేవపూర్ మండలం బీరసాగర్ ఇసుక క్వారీ సమీపంలో ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ, ప్రధాన రోడ్డుపైకి వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుడి ముఖం పూర్తిగా నుజ్జునుజ్జై గుర్తుపట్టలేని విధంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరనేది గుర్తించాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇసుక లారీల అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్: ప్రకాష్, మహదేవపూర్, జయశంకర్ జిల్లా భూపాలపల్లి