చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి-
భూపాలపల్లి, మేజర్ న్యూస్, భూపాలపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు పనుల కోసం తమ దుకాణాలను స్వచ్ఛందంగా తొలగించుకొని ప్రభుత్వానికి సహకరించిన చిరు వ్యాపారులు ప్రస్తుతం ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ భూపాలపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత నెల రోజులుగా వ్యాపారాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, దసరా, దీపావళి పండుగల సీజన్‌లో కూడా ఉపాధి కోల్పోయారని, బ్యాంకు ఈఎంఐలు, అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలపారు. చిరు వ్యాపారస్తులు సుమారు 200 పైగా కుటుంబాలు ఆగం అయ్యారు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన చిరు వ్యాపారులను గుర్తించి ప్రత్యామ్నాయ వ్యాపార స్థలాలు, పక్కా షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రవీణ్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్,గోలి లావణ్య,గుర్రం సంపత్, పెద్దమాముల సంధ్య, సుభద్ర, చిరు వ్యాపారస్తులు రంజిత్,జంపాల తిరుపతి, సతీష్,బోడ బిల్ సింగ్,పవన్ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: రవీందర్, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా