ఆర్టీసీ యాజమాన్య వైఖరి మార్చుకోకుంటే పోరాటం తప్పదు ....
సూర్య కరీంనగర్ ::కరీంనగర్ వన్ డిపోలో యాజమాన్యపు మొండివైఖరికి నిరసనగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మంగళ వారం ఉద్యోగులు మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారంరెడ్డి థామస్ రెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి సెలవులు మంజూరి చేయాలని ఆదేశాలున్నప్పటికిని, కరీంనగర్ 1 డిపోలో యాజమాన్యం, చాలా సిబ్బందికి గైర్హాజరుగా ప్రకటించి జీతంలో కోత విధించిందని ఆరోపించారు. పని భారం తగ్గించాలని ,ఎనిమిది గంటల పని విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బందిల డ్యూటీ చార్ట్ ను సీనియార్టీ ప్రకారం వేయాలన్నారు. డబల్ డ్యూటీల పేరిట వేధింపులు మానుకోవాలన్నారు. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.
టీఎంయూ ఎప్పుడూ కార్మిక పక్షాన నిలబడుతుందని, కార్మికులకు అండగా ఉంటుందని, సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపినారు. అర గంటకు పైగా మెరుపు ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి ,ఎంపీ రెడ్డి, టీఎం యూ రీజియన్, అద్యక్ష కార్యదర్శులు జీ.పీ.సింగ్ ఏవీఆర్ రెడ్డి,
పి సుజాత, కరుణ,కరీంనగర్ వన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎం రమేష్, జి మనోహర్,
వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ భూజేందర్, అలీ రెహమాన్, కేకే రెడ్డి, శ్రీకాంత్, సంగీత, ఎన్ శ్రీనివాస్,
లతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.