telangana
అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం
రంగారెడ్డి / అబ్దుల్లాపూర్‌మెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ నోట్లు పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రూ.6.7 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ చలామణి ముఠాకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ భారీ నకిలీ నోట్ల నెట్‌వర్క్‌కు సంబంధించిన మూలాలు, తయారీ, మరియు ఎక్కడెక్కడ చలామణి చేసేందుకు ప్రణాళిక రచించారనే వివరాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు మధ్యాహ్నం 2 గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా విలేకరుల సమావేశంలో పాల్గొని నిందితుల వివరాలు, నోట్ల స్వాధీనం ప్రక్రియను అధికారికంగా వెల్లడించనున్నారు.