మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు...ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమికే ప్రజా మద్దతు
వెంకటాచలం, మేజర్ న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయాలు సాధిస్తోంది. పులివెందుల, పుంగనూరుతో పాటు అన్ని స్థానాల్లోనూ వైసీపీ చేతులెత్తేసింది. జగన్ రెడ్డి వెళ్లి రోడ్లపై కూర్చున్నా ఫలితం లేకుండా పోయింది. ఎల్లుండి జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు సత్తా చాటబోతున్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో నేను అభివృద్ది చేసి చూపించాను. 7200 ఎకరాలకు సంబంధించి దళిత, గిరిజన రైతులకు సీజేఎప్ఎస్ పట్టాలు రద్దు చేయించి డీకేటీ పట్టాలు ఇప్పించాను యాజమాన్య హక్కులు పొందడంతో పాటు అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో ఈ రైతులు లబ్దిపొందుతున్నారు ఈ భూములన్నింటికి సంబంధించి ఏడాదికి రూ.150 కోట్ల వరకు అన్నదాత సుఖీభవ ప్రయోజనం చేకూరుతోంది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా వ్యాప్తంగా 70 వేల మందికి ఈ ప్రయోజనం చేకూర్చడం చాలా సంతోషంగా ఉంది రూర్బన్ పథకంలో భాగంగా వెంకటాచలం మండలంలో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం ఇక పొదలకూరులో కండలేరు ఎడమ కాలువ లిప్ట్, సామాజిక ఆరోగ్య కేంద్రం, మెగా మినరల్ వాటర్ ప్లాంట్, సోమశిల దక్షిణ కాలువ, ఐటీఐ, నిమ్మ మార్కెట్ యార్డ్, 150 చెక్ డ్యాంలు...చెప్పుకుంటూ పోతే ఇక ఎన్నో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు మండలాల ప్రజలకు ఉపయోగపడేలా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించాం...రోగుల కోసం రూ.2 కోట్లతో ఏసీ బ్లాక్ నిర్మించబోతున్నాం నోరు పారేసుకుంటున్న కాకాణి చేసిందేమిటంటే...దక్షిణ కాలువ పనులను అడ్డుకోవడం...మెగా మినరల్ వాటర్ ప్లాంటును మూలనపెట్టడం, అన్నక్యాంటీన్ మూసేయడం మనుబోలు మండల రైతుల చిరకాల కోరిక అయిన డేగపూడి -బండేపల్లి కాలువ పనులను మేం మొదలుపెడితే కమీషన్ల కోసం అడ్డుకున్న చరిత్ర కాకాణిది వెంకటాచలంలో ఈదగాలి పెద్దరెడ్లతో కలిసి రూ.53 కోట్ల విలువైన గ్రావెల్ ను అక్రమంగా ఎత్తేశారు..విజిలెన్స్ నోటీసులు ఇవ్వగానే కోర్టు స్టే తెచ్చుకున్నారు మరో కేసులోనూ రూ.11 కోట్లు ఫైన్ కట్టకుండా కోర్టును ఆశ్రయించారు ఈ రెండు కేసుల్లోనూ వారిని వదిలి పెట్టబోము..నేను కూడా న్యాయపోరాటంలో భాగస్వామి అవుతాను నియంతృత్వ పోకడలను వదిలిపెట్టి పొగురు తగ్గించుకోవాలని ఈదగాలిలో అరాచకాలు సృష్టించే వారికి హితవు పలుకుతున్నాను దొంగతనంగా గ్రావెల్ ఎత్తుకెళ్లడమే గాక..ఏ పాపం తెలియని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఎఫ్ఐఆర్ చేయించిన ప్రబుద్ధులు వీళ్లు కసుమూరులో గిరిజనులు, దళితులే లేనట్టు వెంకటాచలం నుంచి పోయి 7.80 ఎకరాలు ప్రభుత్వ భూములు రాయించుకున్నారు మరుపూరులో కోట్లాది రూపాయల విలువైన 57 ఎకరాల భూములను అంకయ్య గౌడ్ కుటుంబానికి రాసిచ్చేశారు రామదాసుకండ్రిగలో అల్లుడి పేరుతో కారుచౌకగా భూములను కొట్టేశారు పొదలకూరులో గిరిజన సర్పంచ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పంచాయతీ నిధులు రూ.60 లక్షలు కొట్టేసిన వాకాటి శ్రీనివాసులు రెడ్డి పెద్దమనిషంట రుస్తుం మైన్ లో నేను సత్యాగ్రహం చేస్తున్న సమయంలో రౌడీ మూకలతో హడావుడి చేసిన వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు నంగి ఏడుపులు ఏడుస్తున్నాడు చేసిన పాపాలన్నీ చేసి ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కాకాణి నోరు పారేసుకుంటున్నాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాకాణి లాంటి వారికి బుద్ధిచెప్పాలని ప్రజలను కోరుతున్నా.