BREAKING
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ. తక్కెళ్ళపాడులో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల చేరికలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు. తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు

తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు

Select Suryaa Now
తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు

తిరుమలగిరిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు 

ఫ్యాన్ గుర్తుకు ప్రజల నుంచి విశేష స్పందన.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజా ఆశీర్వాదo

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తన్నీరు సుధారాణి

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది._

తిరుమలగిరి–చిల్లకల్లు ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి గొర్రెపాటి కుమారి, జడ్పీటీసీ అభ్యర్థి మండవ శ్రీనివాస్ గౌడ్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు  సతీమణి తన్నీరు సుధారాణి పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా తన్నీరు సుధారాణి మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసిందని తెలిపారు. ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీటీసీ అభ్యర్థి గొర్రెపాటి కుమారి, జడ్పీటీసీ అభ్యర్థి మండవ శ్రీనివాస్ గౌడ్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో 

గ్రామ పార్టీ అధ్యక్షులు కరిసే ఇజ్రాయిల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు ఏడుకొండలు, జగ్గయ్యపేట మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి బండి రామాంజనేయులు, కరిసే కరుణాకర్, ఎనుగుల గోపి, దుర్గారావు, శ్రీదేవి, రాచబంటి వెంకటనారాయణ, గుడారు గురుస్వామి, రత్తయ్య, ఆశీర్వాదం, రంగారావు, కరిశ యాకోబు, మగినం రమేష్, మారేపల్లి పుల్లయ్య, లింగిశెట్టి వెంకటేష్, కోనేటి రాంబాబు, కోనేటి జగదీష్, బాల్తు రమేష్, మగినం పవన్ కుమార్, పోతురాజు సైదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా