BREAKING
భూసార పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా ఆర్టీసీ యాజమాన్య వైఖరి మార్చుకోకుంటే పోరాటం తప్పదు .... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ.

కళకే కళంకితులు..

Select Suryaa Now
కళకే కళంకితులు..

సూర్య, వేములవాడ:-నమ్ముకున్న కళే జీవనాధారంగా, చెమట చుక్కలు చిందిస్తేనే కడుపు నిండే అమాయక జానపద కళాకారుల జీవితాలతో కొందరు స్వార్థపరులు చెలగాటమాడుతున్నారు. సిరిసిల్లా వేదికగా 'ఫోక్ ఇండస్ట్రీ' పేరుతో తెరపైకి వచ్చిన కొందరు వ్యక్తులు కళాకారుల హక్కుల సాధన ముసుగులో భారీ చందాల వసూళ్లకు తెరలేపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత ఎదుగుదల కోసం కళాకారులను పావులుగా వాడుకుంటూ రాష్ట్ర స్థాయి పదవుల కోసం పాకులాడుతున్న వైనం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.


*రెండు వైపులా దోపిడీ: 
రాజకీయాలకు అతీతంగా కళాకారుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతున్న ఈ సంఘం.. తెరవెనుక మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి లక్షల్లో నిధులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

 

*ప్రశ్నించే గొంతుకలకు 'పదవుల' బేరసారాలు!* 
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు హాయాంలో 500 మందికి పైగా సాంస్కృతిక సారథి (టీఎస్ఎస్ )లో ఉద్యోగాలు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, అర్హులైన వారందరికీ ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.

అధికార పార్టీకి అనుబంధంగా ఉంటూ, తెలుగు భాషా సంఘం సలహాదారులుగా ఉన్న  వంటి వారు సైతం మూడేళ్లుగా కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయారు.కళాకారుల హక్కుల కోసం పోరాడాల్సిన నేతలకు కాంగ్రెస్ సర్కారు చిన్నపాటి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


*హక్కుల సాధన: భజన స్వరమా? ధిక్కార స్వరమా?* 
కళాకారుల సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించాల్సింది పోయి.. అదే అధికార, ప్రతిపక్షాల ఆర్థిక సాయంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హక్కుల కోసం నేరుగా వెళ్లి వినతిపత్రం ఇవ్వాల్సింది పోయి, ఈ చందాల దందా ఎందుకని నిజమైన కళాకారులు ప్రశ్నిస్తున్నారు.

*కళాకారులారా.. తస్మాత్ జాగ్రత్త..* 
ఈ ఫోక్ ఇండస్ట్రీ వెనుక ఉన్న నాయకులలో 70 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నవారేనని, ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారథి నుండి కూడా డప్పు, ఒగ్గుడోలు కళాకారులను రప్పిస్తున్నట్లు సమాచారం.
స్వార్థపరులు మీ బొమ్మలను, మీ కళలను అడ్డం పెట్టుకొని రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఇప్పటికైనా కళాకారులు మేల్కొనాలి. కార్యక్రమాల పేరిట వసూలు చేసిన ప్రతి రూపాయి లెక్కను పత్రికాముఖంగా ప్రకటించాలని డిమాండ్ చేయాలి. రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడే వ్యక్తుల చేతుల్లో మోసపోకుండా, కళలను, కళాకారుల జీవితాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అని కళాకారులు  వాపోతున్నారు