BREAKING
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ. తక్కెళ్ళపాడులో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల చేరికలు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

మేజర్ న్యూస్, తిరుపతి: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరుపతి ఆర్ట్స్ కాలేజ్‌తో పాటు పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వేంకటగిరి కౌంటింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి ఆర్ట్స్ కాలేజ్, నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తతను, భద్రతా విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని, విధుల్లో ఉన్న ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని  ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.