BREAKING
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ నాయకుడికి బండి సంజయ్ పరామర్శ ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలభిషేకం 51వ వార్డు నాయకులు, కార్యకర్తలుతో సమీక్ష సమావేశం నిర్వహించిన కె.కె రాజు గోపాల్ పేట మటన్ దుకాణాలను తనిఖీ చేసిన పశువైద్యాధికారి. సెన్సెక్స్ 772 పాయింట్ల లాభం: 81,979 వద్ద ముగింపు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన కర్ణాటకలో నూతన దేవాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విరుపాక్షి స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. * విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం * లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం రాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం పేదోడి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు మోతె లైబ్రరీ మోడల్‌గా నిలుస్తుంది - త్వరలో సందర్శిస్తా - నవీన్ నికోలస్ ఐఏఎస్ దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్..

జడ్పీ సీఈవో చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి.....

Select Suryaa Now
జడ్పీ సీఈవో చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి.....

​విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గరివిడి జడ్పీటీసీ బొత్స పూజిత, గుర్ల జడ్పీటీసీ సంగంరెడ్డి వెంకటలక్ష్మి  స్థానిక జిల్లా పరిషత్ సీఈవో చేతుల మీదుగా సంబంధిత ధ్రువపత్రాలను గురువారం అందుకున్నారు. ​ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు శోభా స్వాతిరాణి,  కేసలి అప్పారావు హాజరై, సర్టిఫికెట్లు పొందిన జడ్పీటీసీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, మండలాల పరిధిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆకాంక్షించారు. ​కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శోభా స్వాతిరాణి  మాట్లాడుతూ.. జడ్పీటీసీలుగా గెలుపొంది, ఈ రోజు ధ్రువపత్రాలు అందుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ధ్రువపత్రాలు అందుకున్న పూజిత, వెంకటలక్ష్మి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతారని, ప్రాంతీయ అభివృద్ధికి శ్రమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.