రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ నాయకుడికి బండి సంజయ్ పరామర్శ
సూర్య - మానకొండూర్ :మానకొండూరు మండలం గంగిపెల్లికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంబటి తిరుపతిరాజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. వారం రోజుల క్రితం మానకొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతిరాజు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గంగిపెల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గంగిపెల్లి సర్పంచ్ వాల ప్రదీప్ రావు,కరీంనగర్ కార్పొరేటర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, నాయకులు రంగు శ్రీనివాస్, దూలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.