BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం *దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు* సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం! వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం! PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్ భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి

బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ *

Select Suryaa Now
బోరవానిపేటలో  కేంద్ర బృందం పర్యటన  ఏర్పాట్లులను  పరిశీలన   * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ *

శ్రీకాకుళం/గార, సూర్య : గురువారం  బోరవానిపేటలో  బాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుపై   కేంద్ర బృందం  పర్యటన ఏర్పాట్లులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం పరిశీలించారు.  జాతీయ స్థాయిలో బాలహిత గ్రామ పురస్కారం (Child Friendly Village) కోసం నామినేట్ అయిన  గార మండలం బోరవానిపేట గ్రామాన్ని  గురువారం  కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం సందర్శించనున్న నేపథ్యంలో   మండల ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో కేంద్ర బృందం పరిశీలన కోసం ఏర్పాటు చేస్తున్న వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లు, పాఠశాల మౌలిక వసతులు, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆరాదీశారు. బాలల హక్కుల పరిరక్షణ, సంపూర్ణ విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహార భద్రత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాల్లో గ్రామ పంచాయతీ సాధించిన ప్రగతిని కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా గ్రామంలో వంద శాతం బాలల పాఠశాల నమోదు, బడి మానివేతల నివారణ, సంపూర్ణ టీకాలు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిరోధం వంటి అంశాలకు సంబంధించిన రికార్డులు, గణాంకాలు, సాధించిన ఫలితాలను కేంద్ర బృందానికి స్పష్టంగా వివరించేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు.అలాగే మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పోషకాహార మెనూ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మండలం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం, విద్యార్థులు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించే కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

       ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషిత్ ముఖ్య నిర్వహణాధికారి  ఆర్. వెంకటరామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి, జిల్లా పరిషిత్ డిప్యూటీ సీఈఓ కె.సౌమ్య, డివిజన్ పంచాయితీ అధికారి ఆర్. గోపిబాల, స్థానిక తహసీల్దార్ యం చక్రవర్తి, యంపిడిఓ శ్రీనివాస రావు,  పశు సంవర్ధన శాఖ అసిస్టెంట్  డైరెక్టర్ పి ఎస్ జి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.