BREAKING
తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలి

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలి

(నేడు)నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం సాయంత్రం ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.బ్యాలెట్ బాక్సుల తరలింపులో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.బ్యాలెట్ బాక్సులను ఒక గది నుంచి మరొక గదికి తరలించే సమయంలో సంబంధిత ఆర్వో, ఏఆర్వో, పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి మండలంలోని కౌంటింగ్ కేంద్రంలో పురుష, మహిళా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, తగినంత తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించాలని సూచించారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్వోలకు ప్రత్యేక మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే సిబ్బంది, అధికారుల రవాణా సౌకర్యార్థం బస్సు రూట్లకు అనుగుణంగా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సుల ఏర్పాట్లను ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు స్వయంగా పరిశీలించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సకాలంలో పూర్తి చేయాలికౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 7 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం ఏర్పాటు చేయాలని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లో అంతర్గత ఏర్పాట్లను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి, సాయంత్రం 5 గంటలలోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో సంబంధిత అర్వోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.