డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా..
నరసన్నపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి నరసన్నపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది.నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న జుత్తు రామన్న (47), దశమంతపురం గ్రామం, మోతుబారి కృష్ణ (31), పోలాకి గ్రామానికి చెందిన వారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నరసన్నపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన అనంతరం మేజిస్ట్రేట్ ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఎస్సై బలివాడ గణేష్ తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నరసన్నపేట ఎస్సై హెచ్చరించారు.