BREAKING
నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట గన్నవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు బీజేపీ నేతల ఘన నివాళులు బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం

భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ

Select Suryaa Now
భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని జనసేన పార్టీ నాయకుడు మారాసు గురు బాబు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ
మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, హక్కులను కల్పించింది. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం కల్పించే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను మనకు అందించింది. రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంది. ముఖ్యంగా యువత రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*