నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సూర్య, సుల్తానాబాద్
మున్సిపల్ పరిధి లోని శాస్త్రినగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానంతో పాటు అయ్యప్ప స్వాముల నూతన విరి, వంటశాలను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు, గురు స్వామి సాయిరి మహేందర్, గురు స్వాములు మిట్టపల్లి మురళీధర్, మెరుగు వెంకటేశం, వేగోళం అబ్బయ్య గౌడ్ , గందే రాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.