telangana
మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
నాగర్‌కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా నాగర్‌కర్నూల్ పర్యటనలో భాగంగా పదర మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్దిమడుగుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మద్దిమడుగులో మొత్తం రూ.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు కీలక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఇందులో భాగంగా రూ.38 కోట్లతో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం మరియు ఇతర అభివృద్ధి పనులకు, రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు, అలాగే భక్తుల వసతి సౌకర్యార్థం ఆలయ సమీపంలో రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు.