telangana
ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు
సూర్య, చింతలమానేపల్లి : కుటుంబ పోషణ కోసం ఉపాధి వెతుక్కుంటూ వలస కూలీలు చింతలమానేపల్లి మండలానికి చేరుకుంటున్నారు. రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు కెరమెరి వివిధ ప్రాంతాల నుంచి పలువురు కూలీలు కుటుంబాలతో సహా పనుల కోసం వస్తున్నారు. చేతిలో సంచులు, నిత్యావసర వస్తువులు పట్టుకుని రహదారుల వెంట ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వస్తున్నామని కూలీలు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం సాగుతున్న వారి ప్రయాణం వలస కూలీల కష్టాలకు అద్దం పడుతోంది.