BREAKING
పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం : రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కదంః పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు మహారాజా నటి సచానా నమిదాస్ నటనకు హాలీవుడ్ దిగ్గజం టామ్ హాంక్స్ ఫిదా.. ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానంటూ ప్రశంసల వర్షం! గిరి కళాశాలలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం అసైన్డ్ భూమా? ఇనాం భూమా? ఘనంగా 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు సన్ గ్రూప్ ఉద్యోగులకు అనిరుధ్, కావ్య మారన్ గ్రాండ్ విందు.. బంగారు ఉంగరాలతో స్పెషల్ సర్‌ప్రైజ్! కౌంటర్ ర్యాలీలతో కాంగ్రెస్ పోరాటాన్ని అడ్డుకోలేరుః టిపిసిసి చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ రాజ్యాంగం పౌరులకు రక్షణ కవచం - చైర్ పర్సన్ రొoటాల సుహాసిని దిగ్గజ నటుడు ప్యాట్రిక్ స్టీవర్ట్‌కు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక నివాళి.. అవెంజర్స్ డూమ్స్‌డేలో ఎమోషనల్ ట్రిబ్యూట్! ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా

అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తుల నమోదు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర గుర్తింపు పత్రాల ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల నమోదుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం నమోదు కేంద్రానికి వచ్చిన స్థానిక ప్రజలతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. దరఖాస్తుల సమర్పణలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, సిబ్బంది సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పథకం అమలును సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, కమిషనర్ జగదీష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్, వార్డు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.