BREAKING
రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా బిగ్‌బాస్ వివాదం వేళ సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు.. నాకు ఆయన ఒక నటుడిగానే తెలుసంటూ క్లారిటీ! విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం :

అసైన్డ్ భూమా? ఇనాం భూమా?

Select Suryaa Now
అసైన్డ్ భూమా? ఇనాం భూమా?

ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే ప్లాట్ల విక్రయాలు!

రెండు ప్లాట్లు అమ్మేసినా తెలియదంటున్న పంచాయతీ అధికారులు..

*అరెంపుల భూముల వ్యవహారంపై అంతులేని అనుమానాలు!

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :

ప్రభుత్వ భూముల పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అధికారుల పర్యవేక్షణలోనే భూముల వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయనే ఆరోపణలు ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. అసైన్డ్ భూమిగా ప్రచారంలో ఉన్న భూమిని పట్టా భూమిగా మార్చి, ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రెండు ప్లాట్లు విక్రయించినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత పంచాయతీ అధికారులకు తెలియదన్న సమాధానం విస్మయం కలిగిస్తోంది.

అసైన్డ్ భూమా.. ఇనాం భూమా?

సదరు భూమి అసైన్డ్ భూమా? ఇనాం భూమా? అని జీపీవోను వివరణ కోరగా, అది ఇనాం భూమి అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అరెంపుల గ్రామంలో రీ-సర్వే  ప్రభుత్వ భూములు, వివాదాలు ఉన్న భూములను గుర్తించి రీ-సర్వే చేయిస్తామని జీపీవో వివరించారు. అయితే భూమి స్వభావంపై స్పష్టత రావాల్సి ఉండగా, అసలు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి ఏ కేటగిరీలో నమోదై ఉందన్నది కీలకంగా మారింది. ఇనాం భూమి అయితే దాని హక్కులు, బదలాయింపు, పట్టా మంజూరు ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది.

రెండు ప్లాట్లు అమ్మేశారు.. మాకు తెలియదంటున్న అధికారులు!

సదరు భూమిలో ఇప్పటికే రెండు ప్లాట్లు విక్రయించారనే విషయాన్ని జీపీవో దృష్టికి తీసుకెళ్లగా, తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. గ్రామ పరిధిలో భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులకు కనీస సమాచారం కూడా లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. గ్రామంలో జరుగుతున్న భూముల లావాదేవీలపై పర్యవేక్షణ ఎవరి బాధ్యత? అనుమతులు లేకుండా ప్లాట్ల విక్రయాలు జరిగితే వాటిని గుర్తించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ల్యాండ్ కన్వర్షన్.. లేఅవుట్ అనుమతులు ఉన్నాయా?

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలంటే వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు పొందాలి. అదేవిధంగా ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు సంబంధిత లేఅవుట్ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది. అయితే సదరు భూమికి ల్యాండ్ కన్వర్షన్ జరిగిందా? లేఅవుట్ ఆమోదం పొందిందా? అన్న విషయాలపై స్పష్టత లేదు. అనుమతులు లేకుండానే రెండు ప్లాట్లు విక్రయించారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

రీ-సర్వే పేరుతో కాలయాపనా?

అరెంపుల గ్రామంలో ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములపై రీ-సర్వే నిర్వహిస్తామని జీపీవో చెప్పిన నేపథ్యంలో ఈ భూమికి సంబంధించిన అసలు రికార్డులను తక్షణమే పరిశీలించాల్సిన అవసరం ఉంది. రీ-సర్వే పూర్తయ్యే వరకు భూముల లావాదేవీలు కొనసాగితే కొనుగోలుదారులు నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్లాట్ల విక్రయాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ లావాదేవీల వివరాలను కూడా అధికారులు సేకరించాల్సి ఉంది.

కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే అసలు నిజాలు వెలుగులోకి!

జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. సదరు భూమి ఇనాం భూమా? అసైన్డ్ భూమా? పట్టా ఎలా మంజూరైంది? భూమి బదలాయింపు చట్టబద్ధమేనా? ల్యాండ్ కన్వర్షన్, లేఅవుట్ అనుమతులు ఉన్నాయా? ఇప్పటికే విక్రయించిన రెండు ప్లాట్ల వివరాలేమిటి? అనే అంశాలపై రికార్డుల ఆధారంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవైపు భూమి స్వభావంపై స్పష్టత లేకపోవడం.. మరోవైపు రెండు ప్లాట్లు విక్రయించారనే ఆరోపణలు.. ఇంకోవైపు తమకు తెలియదంటున్న పంచాయతీ అధికారులు.. ఈ మొత్తం వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అరెంపుల భూముల బాగోతంపై వాస్తవాలను నిగ్గు తేలుస్తారా? లేక రీ-సర్వే పేరుతో వ్యవహారం మరుగున పడిపోతుందా? అన్నది వేచి చూడాలి.