రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి మౌలిక సూత్రాల ప్రాధాన్యతను చాటిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.