BREAKING
ఎనిమిది గంటల షిఫ్ట్ నిబంధన వల్లే పెద్ద నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు.. అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు! ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

Select Suryaa Now
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో  తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

సూర్య, హుజురాబాద్:శాస్త్రవేత్తలు హెచ్చరించిన ఎల్ నినో కరువు పరిస్థితులను ఎదుర్కోలేని సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల తెలంగాణ ఎడారిగా మారనుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...
ఒక్క సీజన్ కి కరువు వస్తేనే ప్రభుత్వం చేతులెత్తేసిందని,పండిన కాస్త పంట కూడా కొనుగోలు చేయలేక పోతున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి  90 సీట్లు వస్తాయి, కోటి ఓట్లు వస్తాయి అని భ్రమల్లో బ్రతుకుతున్నాడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయనకు కూడా తెలుసన్నారు.రేవంత్ రెడ్డి వల్ల మరో 15 ఏళ్లు అధికారంలోకి రామని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది కానీ ఏ సమస్యకు సరైన పరిష్కారం అందించలేక పోతుందని అన్నారు. 
25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంత భయంకరమైన కరువును ఎప్పుడూ చూడలేదనీ, కరువు వస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు కానీ ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణం అన్నారు.వర్షాకాలంలో పండిన పంట కూడా కొనే దిక్కులేదని , ఐకెపి సెంటర్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.500 రూపాయలు అదనంగా ఇస్తాను ఒక కిలో కూడా బయట అమ్మకండి నేనే కొంటా అని చెప్పారు కానీ కొనడం లేదని,
మొక్కజొన్నలు కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడితే 1800 రూపాయలకే అమ్ముకున్నారు. చివరికి రైతులు తిరుగుబాటు చేస్తే కొన్నారు..ఇప్పుడు పండిన ధాన్యం కూడా మిల్లర్లు కొంటున్నారు తప్ప ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని,వచ్చే ఎండాకాలం పంటలు ఉండేటట్టు కనిపించడం లేదు,
పంటలు పండక పోతే బట్టల షాపులు, కిరాణా షాపులు నడవవు. స్కూలు ఫీజులు సరిగా చెల్లించలేరు. పెళ్లిళ్లు కూడా వాయిదా చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. 90 సీట్లు వస్తాయని సీఎం అంటుంటే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ గెలవదు అని డంకా భజయించి చెప్తున్నారని అన్నారు. రాజ్యాంగం పట్టుకుని పర్యటన చేసే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ఏమిటో ఆయనకే తెలియాలన్నారు.