BREAKING
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్ అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం

విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి

Select Suryaa Now
విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి
సూర్య, సుల్తానాబాద్ : విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద విద్యార్థులకు సూచించారు. భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని గురువారం జిల్లా విద్యాధికారి శారద ఆకస్మికంగా సందర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి విద్యార్థినులతో మాటా మంతి జరిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా  నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోస్ అందిచేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, కిచెన్, స్టాక్ రూమ్, డార్మెటరీ, కంప్యూటర్ గది, కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  స్పెషల్ ఆఫీసర్ స్వప్న,  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.