BREAKING
ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్

ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : కొమరం భీమ్ జిల్లాలో వాహన ప్రమాదాలు జరుగకుండా నివారించడానికి ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్.పి. నితికా పంత్, కాగజ్‌నగర్ సబ్‌ కలెక్టర్ హర్షచౌదరి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్‌రావు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు జరుగకుండా ప్రతి ఒక్కరు రక్షణ సూత్రాలు, రహదారి నిబంధనలు పాటించాలని తెలిపారు. రహదారులపై వాహనాలు నిలిపే విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని, ఆయా రహదారులపై గుంతలను పూడ్చాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల వేగ నియంత్రణ సూచిక బోర్డులు, రక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారి మూల మలుపుల వద్ద చెట్లు, పొదలను తొలగించాలని, బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలని తెలిపారు. రహదారిపై పశువులు సంచరించకుండా మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పశువుల వల్ల ప్రమాదం సంభవిస్తే యజమానులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనదారుడు సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలనన, పాఠశాల, కళాశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని ద్విచక్ర వాహనదారులు, ఆటో చోదకులు వాహనాలను వేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు జరుపుతున్నారని, అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, జాతీయ రహదారిపై సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డి.ఎస్.పి.లు అశోక్, వహిదుద్దీన్, రహదారులు భవనాలు, రవాణా, మున్సిపాలిటీ, ఇంజనీరింగ్, విద్యాశాఖ, ఆర్.టి.సి., జాతీయ రహదారుల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.