BREAKING
పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం లెక్కింపు పునఃప్రారంభం నన్ను నేను బిహార్ బ్రాడ్ పిట్ అని ఎందుకు పిలుచుకుంటానో చెప్పిన రవికిషన్.. కాఫీ విత్ కరణ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఎనిమిది గంటల షిఫ్ట్ నిబంధన వల్లే పెద్ద నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు.. అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు! ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు!

అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత

Select Suryaa Now
అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత

సూర్య వీణవంక:భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే మండల స్థాయిలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవడంలో నిర్లక్ష్యం చూపడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన పనిచేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను రాజ్యాంగం దేశ ప్రజలకు అందించింది.
అలాంటి మహనీయుడి ఆశయాలను స్మరించుకుంటూ కనీసం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం, రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదవులు, రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న నాయకులు దేశ ప్రజలకు హక్కులు, సమానత్వం, స్వేచ్ఛను అందించిన రాజ్యాంగ నిర్మాతను మాత్రం మరచిపోవడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు.రాజ్యాంగ దినోత్సవం కేవలం ఒక వేడుకగా కాకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకునే రోజుగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు పేర్కొంటున్నారు.