BREAKING
పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం లెక్కింపు పునఃప్రారంభం నన్ను నేను బిహార్ బ్రాడ్ పిట్ అని ఎందుకు పిలుచుకుంటానో చెప్పిన రవికిషన్.. కాఫీ విత్ కరణ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఎనిమిది గంటల షిఫ్ట్ నిబంధన వల్లే పెద్ద నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు.. అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు! ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు!

పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

 

 

అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల బ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ బహుజన పార్టీ వ్యవస్థాపకులు సంపతి వెంకట యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపతి వెంకట యాదవ్ మాట్లాడుతూ - భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు అణగారిన వర్గాలకు ముడ్డికి చీపురు, మెడకు ముంత కట్టి జంతువుల కంటే హీనంగా చూసేవారని, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల వారు కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు అయ్యే అవకాశం వచ్చిందని అన్నారు.
ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామ ఇజ్రాయిల్ మాట్లాడుతూ అంబేద్కర్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
రాజుపాలెం మండల ఎంఆర్పీఎస్ కన్వీనర్ సండ్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారన్నారు.
ఆర్టీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోడిరెక్క కుమార్ మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంచాయతీ ప్రెసిడెంట్ నుండి ఇండియా ప్రెసిడెంట్ వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంద హనుమంతరావు, చౌటుపల్లి డేవిడ్, మంద ఏసోబు, మీసాల లాజరు, లంజపల్లి కోటేశ్వరరావు, ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా జనరల్ సెక్రటరీ బోర్డెపూడి జీవరత్నం, మాజీ యార్డ్ డైరెక్టర్ మంద యెహోషువ, ఎస్ కె బాజీ, ఎస్ కె నాగూర్, ఎస్ కె సైదా, ఎస్ కె జానీ బాబు, రిటైర్డ్ మాస్టర్ ఊరె ప్రభాకర్ రావు, అంగడి శీను, యేసుపోగు పాపారావు, కంపా శ్రీనివాసరావు, మీసాల మరియ బాబు, మంద బాబురావు తదితరులు పాల్గొన్నారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల