డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్*
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అక్టోబర్ నవంబర్ నెలలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలలో రేడియాలజీ విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని రజితకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక మార్కులు తెచ్చుకోవడంతో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కు ఎంపికైనట్లు రేడియాలజీ విభాగం ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ శ్రీ రేడియాలజీ విభాగాన్ని అభినందిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రజితను పుష్పగుచ్చాలతో శాలువాతో సత్కరించారు. రేడియాలజీలో మొట్టమొదటి బ్యాచ్ పరీక్షలు రాయిగా మొదటి బ్యాచ్ విద్యార్థినికి యూనివర్సిటీ అవార్డు రావడం అనంత మెడికల్ కళాశాలకు గర్వకారణము మరియు స్ఫూర్తిదాయకమని ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ రేడియాలజీ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ అధ్యాపకులు,
ప్రముఖ రేడియాలజిస్ట్ అయిన హెచ్వోడి డాక్టర్ సురేష్ గారు డిపార్ట్మెంట్లో మంచి అద్భుతమైన బోధన చేయడంతో పాటు వారి సిబ్బందితో కూడా బాగా తర్ఫీదు ఇవ్వడం వలన విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం కలిగిందని అదే స్ఫూర్తితో అన్ని విభాగాలు పనిచేసే మరింత మంచి ఫలితాలను మన కళాశాల అందిస్తారని ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రేడియాలజీ విభాగం వైద్యులు హెచ్ ఓ డి డాక్టర్ సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, డాక్టర్ రాజేంద్ర నాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వెంకట కళ్యాణ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ నిహారిక, సీనియర్ అసిస్టెంట్లు డాక్టర్ నలిని, డాక్టర్ స్నేహిత, రేడియాలజీ విభాగం పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.