BREAKING
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు బీజేపీ నేతల ఘన నివాళులు బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నిజాంపట్నం, మేజర్ న్యూస్: ప్రతి ఏటా నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్) వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా జరుపుకోవడం జరుగుతుందని ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపాల్ నాయుడు మాస్టారు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్  నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విద్యార్థినీ విద్యార్థులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయుడు మాస్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలో, కళాశాలలో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదువుతారు. మైగవ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో 23 భాషల్లో పీఠిక చదివి సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది. రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బి .అంబేద్కర్ మరియు ఇతర నేతలను స్మరించుకుంటూ సెమినార్లు సాంస్కృతి క కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులందరూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విజయానికి పాటుపడాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నన్నోరయ్య, ప్రసాదు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.