BREAKING
నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత..

పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా

Select Suryaa Now
పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణం 44వ వార్డులో పారిశుధ్య నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూ, వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ సుహైల్ రానా స్వెట్టర్ల పంపిణీ చేశారు. తన సొంత నిధులతో మాజీ కౌన్సిలర్లు సలాముల్లా మియ్య, తమీమ్ చేతులు మీదుగా స్వెట్టర్లను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు సలాముల్లా మియ్య తమీమ్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని, ఎండా, వానా, చలిని లెక్కచేయకుండా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని చలికాలంలో కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో 15మంది శానిటేషన్ సిబ్బందికి స్వెట్టర్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. వార్డు పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్మికుల సంక్షేమం పట్ల కౌన్సిలర్ సుహైల్ రానా ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని పారిశుధ్య కార్మికుల సంక్షేమమే మా బాధ్యత 44వ వార్డు అభివృద్ధి, పరిశుభ్రతే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నూర్ బాషా, రాఘవ, బాషా, రఫీ, మహబూబ్ బాషా పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*