BREAKING
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు బీజేపీ నేతల ఘన నివాళులు బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం

Select Suryaa Now
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం

సూర్య, నంద్యాల బ్యూరో:రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా"ఓటు పరిరక్షణ వేదిక" ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ అర్చ్ నుండి మున్సిపల్ కార్యాలయం లోని డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వరకు "WALK TO RIGHT TO VOTE" అనే నినాదంతో  పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఆ హక్కు ను కాపాడుకుందాం- ఓట్ల తొలగింపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా అడ్డుకుందాం, రద్దు చేయాలి అనే నినాదాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం.లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు ,సీనియర్ నాయకులు తోట మద్దులు,పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ ,మౌలాలి, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు  కే మహమ్మద్ గౌస్,పి వెంకట్ లింగం, భగత్ సింగ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ప్రముఖ న్యాయవాది బి శంకరయ్య, ఎస్ డి పి ఏ జిల్లా కార్యదర్శి ఏజాస్,జన విజ్ఞాన వేదిక నాయకులు గోపాల్, ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆర్ నాయక్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఈ కార్యక్రమంలో  మేధావులు, రాజకీయ నాయకులు,ప్రముఖులు,యువకులు, ప్రజాసంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు కావస్తుందని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేయడం జరుగుతుందని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును లేకుండా చేసేందుకు ఎస్ఐఆర్ను తీసుకువచ్చిందని ఇప్పటికే దేశంలో దాదాపు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించినారని, ఈ ఓట్లలో మెజార్టీగా బిజెపి వ్యతిరేక ఓట్లు అని ఈ ఓట్లను తొలగించకపోతే అధికారంలోకి రావడం కష్టమని భావించి ప్రతిపక్ష కార్యకర్తల,ప్రజల ఓట్లను తొలగించుకోవడం కోసం ఎస్ ఐ ఆర్ ను తీసుకువచ్చిందని ఎస్ఐఆర్ అమలు కోసం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను ఉపయోగించుకుని ఏ విధంగానైనా అధికారంలోకి రావడం కోసమే పనిచేసే విధంగా కీలుబొమ్మలాగా ఉపయోగించుకోవడం జరుగుతుందని,వెంటనే సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని,ఎస్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చూడాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ఎస్ ఐ ఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉందని జెన్ -జడ్ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని దేశంలోని ప్రతి ఒక్క యువత ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు పోరాటంలోకి వచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా