BREAKING
నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట గన్నవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు బీజేపీ నేతల ఘన నివాళులు బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం

కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

సూర్య కరీంనగర్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జి.డి. రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ రచన పుస్తకానికి గౌరవంగా నమస్కరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయాన్ని కల్పించిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవడంతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.