BREAKING
నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట గన్నవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు బీజేపీ నేతల ఘన నివాళులు బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం

రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం

Select Suryaa Now
 రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం
హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో 'సంవిధాన్ రక్షా మార్చ్' (రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అహింసా మార్గంలోనూ యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. దేశంలో పరిపాలన రాజుల చేతిలో కాకుండా, సామాన్య ప్రజల చేతుల్లో ఉండాలనే గొప్ప ఆశయంతోనే రాజ్యాంగ రూపకల్పన జరిగిందని అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు నాడు జరిగిన కుట్రలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తిప్పికొట్టి, దేశ పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించారని కొనియాడారు.

దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందించిన అత్యంత గొప్ప వరం భారత రాజ్యాంగమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే నాయకులను ప్రజలే ఎన్నుకునే అద్భుతమైన ప్రజాస్వామ్య హక్కును రాజ్యాంగం మనకు ప్రసాదించిందని తెలిపారు. అంతేకాకుండా, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనకు కూడా ఈ రాజ్యాంగమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.