BREAKING
సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట గన్నవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి

అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్

Select Suryaa Now
అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్
సూర్య కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలందరి ఆరాధ్యుడని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పించిన మహనీయుడిని దేవుడిగా ఆరాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్ అన్నారు.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను, రాజ్యాంగ ప్రాధాన్యతను వివరించారు.దేశంలోని 148 కోట్ల మంది ప్రజలకు కులమతాలు, ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రాథమిక హక్కులు కల్పిస్తూ, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు.తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రూపొందించిన పాంచజన్యం ఎజెండాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు, జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాకేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రంగరవేణి లక్ష్మణ్, ఎంబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేష్, మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ సయ్యద్ ముబీన్ తదితరులు పాల్గొన్నారు.