BREAKING
ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్ అని తెలిసి మంచం మీద నుంచి పడిపోయినంత పనైంది.. ట్విలైట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్

ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు

Select Suryaa Now
ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హాలీవుడ్ మాజీ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ మధ్య గత నాలుగేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా సాగుతున్న ఫ్రెంచ్ వైన్ ఎస్టేట్ షాటో మిరావల్ న్యాయపోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. తమ కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోర్టు వెలుపలే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు ఇరువురి ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. 2016లో విడిపోయిన తర్వాత 2024 చివర్లో వీరి విడాకుల ప్రక్రియ అధికారికంగా ముగిసినప్పటికీ, దక్షిణ ఫ్రాన్స్‌లోని ఈ విలాసవంతమైన వైన్ ఎస్టేట్ యాజమాన్య హక్కుల విషయంలో మాత్రం కోర్టు కేసులు కొనసాగుతూనే వచ్చాయి. తాజా ఒప్పందంతో ఇద్దరి మధ్య ఉన్న అన్ని ప్రధాన న్యాయ వివాదాలు ముగిసినట్లయింది.  

2008లో బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ కలిసి ఫ్రాన్స్‌లోని 1,300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న షాటో మిరావల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. 2014లో వీరి వివాహం కూడా ఇక్కడే జరిగింది. అయితే విడిపోయిన తర్వాత 2021లో తనకున్న 50 శాతం వాటాను ఏంజెలినా జోలీ రష్యన్ వ్యాపారవేత్త యూరి షెఫ్లర్‌కు చెందిన స్టోలీ గ్రూప్ అనుబంధ సంస్థకు విక్రయించడంతో వివాదం రాజుకుంది. పరస్పర అంగీకారం లేకుండా వాటాను విక్రయించడం ఒప్పంద ఉల్లంఘనేనని ఆరోపిస్తూ బ్రాడ్ పిట్ 2022 ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించారు.

దీనికి ప్రతిగా ఏంజెలినా జోలీ కూడా 2022 అక్టోబర్‌లో కౌంటర్ దావా వేశారు. తన వాటాను బ్రాడ్ పిట్‌కే విక్రయించేందుకు సిద్ధమైనప్పటికీ, 2016లో ప్రైవేట్ విమాన ప్రయాణంలో జరిగిన వివాదం గురించి ఎక్కడా మాట్లాడకూడదనే కఠినమైన నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన ఒత్తిడి తెచ్చారని జోలీ తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బ్రాడ్ పిట్ తరపు న్యాయవాదులు అప్పట్లోనే తీవ్రంగా ఖండించారు. పరస్పర ఆరోపణలతో హాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు సామరస్యపూర్వక పరిష్కారానికి వచ్చింది.

ప్రస్తుతం కుదిరిన రాజీ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను బహిర్గతం చేయబోమని, ఈ విషయంపై ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోమని ఇరువర్గాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మీడియాలో వచ్చే అనధికారిక కథనాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. కాగా, జోలీతో వివాదం ముగిసినప్పటికీ, ఎస్టేట్ వాటాలు కొనుగోలు చేసిన స్టోలీ గ్రూప్ యజమాని యూరి షెఫ్లర్‌పై బ్రాడ్ పిట్ దాఖలు చేసిన సమాంతర కేసు మాత్రం ఇంకా కొనసాగుతోందని సమాచారం.
Also Read: మూడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ హాలీవుడ్ నటి ఆన్ హ్యాథవె, ఖుషీలో దంపతులు