BREAKING
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ రాజ్యాంగం పౌరులకు రక్షణ కవచం - చైర్ పర్సన్ రొoటాల సుహాసిని దిగ్గజ నటుడు ప్యాట్రిక్ స్టీవర్ట్‌కు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక నివాళి.. అవెంజర్స్ డూమ్స్‌డేలో ఎమోషనల్ ట్రిబ్యూట్! ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్ అని తెలిసి మంచం మీద నుంచి పడిపోయినంత పనైంది.. ట్విలైట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు

సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా

Select Suryaa Now
సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ, పరీక్షల విస్తరణ, కొత్త కేసుల గుర్తింపు, బాధితులకు ఏఆర్‌టీ చికిత్స కొనసాగింపు, వైరల్‌ లోడ్‌ పరీక్షల నిర్వహణలో సమర్థవంతమైన చర్యలు చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా సురక్షిత్‌ కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీకి ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించి, మారుమూల గ్రామాల్లోనూ మొబైల్‌ ఐసీటీసీ వాహనాల ద్వారా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స మధ్యలో నిలిపివేసిన బాధితులను గుర్తించి తిరిగి ఏఆర్‌టీ చికిత్సలోకి తీసుకురావడంతో పాటు, వారికి నిరంతర కౌన్సెలింగ్‌, వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాధన, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఈశ్వర్‌, డీఏపీసీయూ నాగరాజు ఆధ్వర్యంలో వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఆర్‌టీ, ఐసీటీసీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని కలెక్టర్‌ అభినందించారు.భవిష్యత్తులోనూ హెచ్‌ఐవీ పరీక్షల విస్తరణ, బాధితులకు నిరంతర చికిత్స, ప్రజల్లో అవగాహన పెంపునకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా గౌరవప్రదమైన వైద్య సేవలు అందిస్తూ, హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.