BREAKING
ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్ అని తెలిసి మంచం మీద నుంచి పడిపోయినంత పనైంది.. ట్విలైట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్

కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు

Select Suryaa Now
కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ దేవాలయం వద్ద గురువారం ఆలయానికి సంబంధించిన వివిధ కాంట్రాక్టుల బహిరంగ వేలం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ అను గీత, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ మైసయ్య, పాలకవర్గ సభ్యుల సమక్షంలో వేలం ప్రక్రియ చేపట్టారు. ఈ వేలంలో పలువురు వ్యాపారులు పోటాపోటీగా పాల్గొని వేలం పాటలు పాడారు.వేలంలో పులిహోర, లడ్డూ ప్రసాదాల కాంట్రాక్టును రూ.35.13 లక్షలకు తిగుల్ నర్సాపూర్‌కు చెందిన త్రికర్ రెడ్డి దక్కించుకున్నారు. ఒడిబియ్యం కాంట్రాక్టును రూ.28.50 లక్షలకు చాట్లపల్లికి చెందిన పకోళ్ల అశోక్ దక్కించుకున్నారు. కొబ్బరికాయల కాంట్రాక్టును రూ.26.30 లక్షలకు తిగుల్ నర్సాపూర్‌కు చెందిన దుబ్బటి కాత్యక్ దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కల కాంట్రాక్టును రూ.9 లక్షలకు బాబు దక్కించుకున్నారు.ఈ నాలుగు కాంట్రాక్టుల ద్వారా ఆలయానికి మొత్తం రూ.98.93 లక్షల ఆదాయం సమకూరనుంది. ఆలయ ఆదాయాన్ని పెంపొందించే దిశగా బహిరంగ వేలం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(అనిల్ జగదేవపూర్ మండల రిపోర్టర్)