telangana
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.
ప్రధానంగా విదేశీ, స్వదేశీ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ సీఈవోలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపడం, వారికి కల్పించాల్సిన ప్రొటోకాల్, వసతి, రవాణా సౌకర్యాలపై మంత్రులు అధికారులకు కీలక సూచనలు చేశారు.