జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని స్థానిక శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ( సీతమ్స్) కు చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికై కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. అనంతపురం జిల్లా జెఎన్ టి యు ఎ వారి ఆధ్వర్యంలో ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ (పురుషులు అండ్ మహిళలు) జట్టు ఎంపిక ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ ఈనెల 24వ తేదీ కుప్పం ఇంజనీరింగ్ కళాశాల, కుప్పంలో నిర్వహించారు.ఈ ట్రయల్స్‌లో సీతమ్స్ కళాశాలకు చెందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి కె. మౌనిక, సి ఎస్ ఈ సెకండ్ ఇయర్ కె. షాలిని అనే ఇద్దరు విద్యార్థినులు అద్భుతంగా ప్రదర్శన చేసి జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. వీరిని సీతమ్స్ మేనేజింగ్ ట్రస్టీ డా. డి. ఎ. కల్పజ, చైర్మన్ కె. రంగనాథం, అకడమిక్ అడ్వైజర్ ప్రొఫె. కె. ఎల్. నారాయణ విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు. వారికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు శాంత కుమార్ శ్వేతా కృష్ణ కృషిని అభినందించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.