telangana
అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
సూర్య కరీంనగర్ : స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.అండర్-17 బాలికల విభాగంలో కే. లిషిత్ అక్షయ (9వ తరగతి), అండర్-17 బాలుర విభాగంలో జి. శ్రీహరినాథ్, జె. ప్రణీత్ (9వ తరగతి), అండర్-14 బాలుర విభాగంలో పి. మాన్విత్ రెడ్డి, బి. రుత్విక్ (7వ తరగతి) ఎంపికయ్యారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.