BREAKING
ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్

దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Select Suryaa Now
దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: నల్గొండ జిల్లాను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ సురక్షిత రహదారులను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం సర్క్యూట్‌గా దర్వేశిపురాన్ని నిలుపుతానని తెలిపారు. దర్వేశిపురం రేణుకాఎల్లమ్మ ఆలయం.. గొప్ప ఆధ్యాత్మిక ప్రాంతమని మంత్రి చెప్పుకొచ్చారు. వేల సంఖ్యలో ఈ గుడికి నిత్యం భక్తులు వస్తుంటారని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 5 ఎకరాల్లో హరిత హోటల్, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడతామని వివరించారు. మైల సముద్ర ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌గా నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.