BREAKING
పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం లెక్కింపు పునఃప్రారంభం నన్ను నేను బిహార్ బ్రాడ్ పిట్ అని ఎందుకు పిలుచుకుంటానో చెప్పిన రవికిషన్.. కాఫీ విత్ కరణ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు! ఎనిమిది గంటల షిఫ్ట్ నిబంధన వల్లే పెద్ద నిర్మాతలు నన్ను తీసుకోవడం లేదు.. అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు! ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు!

విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...!

Select Suryaa Now
విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...!

విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...!


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -:  విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని కోటా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య బాయి తెలిపారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోట నందు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య బాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ముందుగా పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి డా: బి. ఆర్. అంబేద్కర్  చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య బాయి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత దేశం అతిపెద్ద రాజ్యాంగము కలిగిన గణతంత్ర రాజ్యం గా అభివర్ణించారు. అనంతరం పాఠశాల సీనియర్ సోషల్ ఉపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, విలువలను, ప్రజలకు  కల్పించిన హక్కులను, న్యాయం,స్వేచ్ఛ ,స్వాతంత్ర్యం,సమానత్వం,రక్షణను గురించి వివరించారు. రాజ్యాంగ రూప శిల్పి డా: బి. ఆర్. అంబేద్కర్ గారు చేసిన సేవలను గూర్చి కొనియాడారు. అనంతరం రాజ్యాంగం గురించి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది చేతుల మీదుగా బహుమతుల పంపిణీ చేశారు. చివరగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఈశ్వరయ్య , ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్, మల్లికార్జున రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగశేషులు ఉపాధ్యాయునిలు విజయ కుమారి, సరోజినీ దేవి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.