telangana
గిరి కళాశాలలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశానుసారం భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం కార్యక్రమాన్ని కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులు లెఫ్టినెంట్ పుట్టా లక్ష్మణ్ ఎన్సిసి ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నేటి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరియు భారత రాజ్యాంగ ప్రతి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముంతాజ్ బేగం మరియు అధ్యాపకులు ఆవిష్కరించడం జరిగింది, భారత రాజ్యాంగ ప్రాధాన్యతను, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు తో పాటు ముఖ్యాంశాలను తెలియపరిచే భారత రాజ్యాంగ పీఠిక ను విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. నేటి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముంతాజ్ బేగం, కళాశాల అధ్యాపకులు కే సునీల్ కుమార్, డాక్టర్ పి శ్రీలత, సురేందర్, జితేందర్, శ్రీను, సురేష్ యాదవ్, రామకృష్ణ మరియు గణేష్ తో పాటు కళాశాల విద్యార్థులందరూ పాల్గొని ,నేటి రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది....