BREAKING
ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్ అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా

విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్‌లో గల విజేత హైస్కూల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పార్లమెంట్‌ సమావేశాలను నమూనాగా రూపొందించి ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంట్‌ పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.విద్యార్థులు ప్రధానమంత్రి, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఎంపీలు, స్పీకర్‌ తదితర పాత్రలను పోషిస్తూ నిర్వహించిన నమూనా పార్లమెంట్‌ కార్యక్రమం ఆకట్టుకుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం, సమాజం పట్ల బాధ్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠ్యాంశాలతో పాటు ఇటువంటి ఆచరణాత్మక కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఇందులో ప్రిన్సిపాల్ కృష్ణవేణి,  ఉపాధ్యాయులు, విద్యార్థులు ,తదితరులు ఉన్నారు.