BREAKING
రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా బిగ్‌బాస్ వివాదం వేళ సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు.. నాకు ఆయన ఒక నటుడిగానే తెలుసంటూ క్లారిటీ! విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం :

రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కదంః పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు

Select Suryaa Now
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కదంః పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’ విజయవంతంగా ముగిసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా కదిలి నిర్వహించిన ఈ సంవిధాన్ రక్షక్ మార్చ్ విజయవంతంగా ముగిసింది.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.