telangana
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి
సూర్య కరీంనగర్ : భారత రాజ్యాంగం ఆమోదించబడిన చారిత్రాత్మక దినం (26 నవంబర్ 1949) – ‘భారత రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గల రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ సేవలను, భారత ప్రజాస్వామ్యానికి ఆయన అందించిన మహోన్నత రాజ్యాంగ విలువలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, సరిల్లా ప్రసాద్, బుచ్చిరెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని డా. బి.ఆర్. అంబేడ్కర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.