బాల్య వివాహ రహిత భారత్ – 100 రోజుల అవగాహన కార్యక్రమం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ రహిత భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా, 2026 అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. నాగశైలజ ఆదేశాల మేరకు నెల్లూరులోని బి వి ఎస్ మహిళ హై స్కూల్ , నవాబుపేటలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్ మాట్లాడుతూ... విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలబాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి కాల్ చేయాలి మరియు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు బాల్య వివాహ రహిత భారతదేశ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయజ్యోతి, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు మస్తానమ్మ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సంయుక్త, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుమలత, చైల్డ్‌లైన్ సిబ్బంది లావణ్య, శైలజ తదితరులు పాల్గొన్నారు.