15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత!! ఎస్సై ప్రదీప్ రాజు
15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత!! రామగిరి ఎస్సై ప్రదీప్ రాజు
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని రామగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ప్రదీప్ రాజు మాట్లాడుతూ గుత్తి నుంచి కర్ణాటక ఐచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు 15 బియ్యాన్ని పెనుగోలు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలను అరికట్టడంలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఈ వాహనం పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రేషన్ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలకుండా నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శంకర్, రెవిన్యూ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.