ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యం - త్రికాల మనోజ్ కుమార్
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా రాంగోపాల్‌పేట్ డివిజన్ ప్రెసిడెంట్ త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొని పట్టభద్రుల నమోదు ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ, నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు