BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

'బ్యాచిలర్ పార్టీ దూ' సినిమాలో కుంచాకో బోబన్ పాత్ర విడుదల

Select Suryaa Now
'బ్యాచిలర్ పార్టీ దూ' సినిమాలో కుంచాకో బోబన్ పాత్ర విడుదల

అమల్ నీరద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ మలయాళ చిత్రం 'బ్యాచిలర్ పార్టీ దూ' (Bachelor Party Deux). 2012లో వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన 'బ్యాచిలర్ పార్టీ'కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా హీరో కుంచాకో బోబన్ క్యారెక్టర్ పోస్టర్‌ను, దాంతోపాటు నటీనటులతో కూడిన కొత్త పోస్టర్లను విడుదల చేశారు.

ఈ చిత్రంలో కుంచాకో బోబన్ 'ధీరజ్ ప్రభు' అనే క్లాసీ అండ్ స్టైలిష్ పాత్రలో కనిపించనున్నారు. నలుపు, బంగారు వర్ణం వర్క్ ఉన్న కోటు ధరించి చాలా స్టైలిష్ లుక్‌లో ఆయన ఉన్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

నస్లేన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, ప్రకాష్ రాజ్, రాజీషా విజయన్ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.